BREAKING
చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం
www.ntodaynews.com

వెంటనే  బిల్లును రద్దు చెయ్యాలి.

తెలంగాణ
24 Dec, 2025 - 05:56 AM
250 వీక్షణలు

కేంద్రం తీసుకువచ్చిన విబి-జి రామ్ జి బిల్లు: వికలాంగుల జీవనోపాధి హక్కుపై దాడి

NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా  తీవ్రంగా వ్యతిరేకించిన NPRD యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో వికసిత్ భారత్ – రోజ్‌గార్ మరియు ఆజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లు, 2025 (VB-GRAMG బిల్లు) వికలాంగుల జీవనోపాధి పై తీవ్ర ప్రభావం చూపుతుందని, కేంద్రం తీసుకువచ్చిన బిల్లు రద్దు అయ్యే వరకు ఉద్యమం చేస్తామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ హేచ్చరించారు. బుధవారం  వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ముఖ్య నాయకుల సమావేశం జిల్లా కేంద్రం లో జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నిరుద్యోగం, భూమిలేని, పేదరికంలో ఉన్న వికలాంగులకు, గ్రామీణ ప్రాంతంలో ఉపాధికి కల్పించెందుకు ఉపాధి హామీ పథకం వచ్చిందని అన్నారు. నిధుల కొరత, పని నిరాకరణ, డిజిటల్ హాజరు వ్యవస్థలు మరియు పని ప్రదేశాలలో సరైన సౌకర్యాలు లేకపోవడం వలన వికలాంగులలో పని చేసే వారి సంఖ్య తగ్గితుందని అన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6,38,088 మంది వికలాంగులకు ఈ పథకం కింద ఉపాధి కల్పించబడిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతంలోని వికలాంగ కార్మికులకు జీవనోపాధిని మరింతగా కోల్పోయేలా చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వికలాంగులను తీవ్రమైన పేదరికంలోకి నేడుతుందని అన్నారు. ఈ బిల్లు 125 రోజుల పనిని అందిస్తుందనే వాదన పూర్తిగా తప్పుదారి పట్టించేదిగా ఉందని అన్నారు ఉద్దేశపూర్వక నిధుల కొరత కారణంగా సగటు ఉపాధి 50 రోజుల కంటే తక్కువగా ఉందని అన్నారు. వికలాంగులను ఉపాధికి అర్హులైన కార్మికులుగా, సామర్థ్యం ప్రకారం పని చేయడానికి మరియు జీవనోపాధి రక్షణకు చట్టబద్ధంగా గుర్తిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన VB-GRAMG బిల్లు వికలాంగుల హక్కును బలహీనపరుస్తుందని అన్నారు. గ్రామీణ వికలాంగ కార్మికుల జీవనోపాధి, గౌరవం మరియు మనుగడకు ముప్పు కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం, 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం స్ఫూర్తికి భిన్నంగా ఉందని అన్నారు. ఇది వివక్ష చూపకపోవడం, సరైన సౌకర్యాలు కల్పించడం మరియు జీవనోపాధిని రక్షించడం చేస్తుందని అన్నారుఈ పథకం నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించడం ఆమోదయోగ్యం కాదని అన్నారు.VB-GRAMG బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం గాంధీని చంపినా గాడ్సే వారసుల పేరుతో పథకాన్ని తీసుకురావడం సరైంది కాదని అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షణ కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సురుపంగా ప్రకాష్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్లపల్లి స్వామి జిల్లా కోశాధికారి కొత్త లలిత శ్రీహరి గోపి మురళి నాయక్ లింగ నాయక్ అనసూయ మధు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube