పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Spread the love

పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం–భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

NTODAY NEWS: బీబీనగర్

అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు మంజూరు చేయడం జరుగుతుందని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం రోజున బీబీనగర్ మండల కేంద్రంలో పి.ఆర్.జి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు తో కలిసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా భువనగిరి శాసన సభ్యులు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులందరికి నిలువ నీడను కల్పించాలనే గొప్ప ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రవేశపెట్టిందన్నారు. పేదల సొంత ఇంటి కలను ప్రభుత్వం దశలవారీగా నెరవేరుస్తుందని ప్రతి లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరవుతాయన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఒక పండుగ వాతావరణంగా ఉందన్నారు. నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమైనప్పుడే కుటుంబా లు బాగుంటాయని అన్నారు.రేకులు, పైకప్పులు లేని నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉంటూ బేస్మెంట్ కట్టుకున్న వారికి లక్ష రూపాయలు,లెంటల్ లెవెల్ వరకు నిర్మించుకున్న వారికి మరో లక్ష రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని ఈ విధంగా మొత్తంగా ప్రతి ఇంటికి ఐదు లక్షలు అందజేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం లబ్ధిదారులకు ఇల్లు కట్టుకునేందుకు ఇసుక, ఎలాంటి కొరత లేకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ పడుతుందన్నారు. ప్రతి పేద ప్రజలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందిస్తుందన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా అర్హులైన ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. నిలువ నీడను కల్పించాలని గొప్ప ఉద్దేశంతో ప్రభుత్వం గొప్ప పథకం ప్రవేశపెట్టిందన్నారు. దశలవారీగా లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరవుతాయన్నారు. ఇండ్లు కట్టుకునే ప్రతి పేద వారు తొందరగా బేస్మెంట్ పూర్తి చేసుకుని ప్రభుత్వం అందిస్తున్న 5 లక్షల సహాయం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, మండల స్పెషల్ అధికారి సుభాషిని, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »