ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై సిపిఐ పోరాటం
-ఘనంగా సీపీఐ శత వార్షికోత్సవాలు
NTODAY NEWS : చిట్యాల
ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై సిపిఐ పోరాటం చేస్తుందని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లోడింగ్ శ్రవణ్ కుమార్ అన్నారు. సిపిఐ 100 వార్షికోత్సవాల సందర్భంగా సీపీఐ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే కుట్రలో భాగంగా ఆ పథకం పేరు మార్చడం జరుగుతుందని పెట్టుబడి దారి విధానానికి వ్యతిరేకంగా సిపిఐ ఉద్యమిస్తుందని అన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా సిపిఐ ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుతుందని అన్నారు. ఈ సందర్భంగా దేశగోని బాలరాజు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఎండి అక్బర్, మండల సహాయ కార్యదర్శి జిల్లా సత్యం, పట్టణ కార్యదర్శి ఎస్కె షరీఫ్, దేవేందర్, దండిగా నరసింహ, రావుల చిన్న వెంకన్న తదితరులు పాల్గొన్నారు.













