చాట్రాయి మండలంలో కుప్ప కూలనున్న విద్యా వ్యవస్థ
చాట్రాయి, జూన్ 24 (NTODAY NEWS ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి)
అధికారులు ముందు చూపు లేకుండా,అనాలోచితంగా, బాధ్యతారహిత్యంగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో విద్యా వ్యవస్థ దెబ్బ తిందని చెప్పొచ్చు. మండలంలో 60 పాఠశాలలలో 40 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి అంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు.అర కొర ఉపాధ్యాయులతో అనేక ఇబ్బందులు పడుతూ పిల్లల్ని కాపాడిన ఉపాధ్యాయులు ఈ మధ్యకాలంలో జరిగిన ఎస్జీటీ బదిలీ కౌన్సిలింగ్లో చాట్రాయి మండలం నుంచి ఎక్కువమంది బయట మండలాలకు వెళ్లిపోయారు.కానీ ఎంటిఎస్ టీచర్లు ఉన్నారనే ధైర్యంతో కనీసం పాఠశాలను తెరిచే పరిస్థితి ఉంది అనే ఆలోచన ఉంది. కానీ నిన్న జరిగిన ఎంటిఎస్ టీచర్ కౌన్సిలింగ్లో మళ్లీ పట్టణ ప్రాంతంలోని ఖాళీలు ఎక్కువగా చూపించటంతో ఎంటీఎస్ టీచర్లకు కూడా వారికి అనుకూలమైన పట్టణాలకి సమీపంలో ఉన్న పాఠశాలలకు బదిలీ కాబడ్డారు. దీంతో చాట్రాయి మండలంలోని పాఠశాలలను నడిపే పరిస్థితి లేక రిలీవర్ లేరు అనే కారణంతో కొందరిని ఆపి మొక్కుబడిగా బళ్ళు తెరిపిస్తున్నారు. ప్రభుత్వం తల్లికి వందనం వేసిన వేళలో కాన్వెంట్ ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలల వైపుకు మళ్ళించి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడం వలన పిల్లలు ప్రైవేటు బడుల బాట పట్టారు. చాట్రాయి మండలంలో ఉపాధ్యాయుల కొరత పట్టి పీడిస్తోంది. గత ఏడాది సుమారు 60 మంది ఉపాద్యాయులు లేకుండానే పాఠశాలలు నడిచాయి. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కాగా ఉపాధ్యాయుల కొరత పై తల్లితండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలకు పంపించాలంటూ ప్రచారం చేయటమే గాని ఉపాధ్యాయులను నియమించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని వలుపురు విమర్శిస్తున్నారు. చాట్రాయి మండలంలో మొత్తం 180 మంది ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా కేవలం 118 మంది ఉపాద్యాయులతోనే కాలం వెళ్ళబుచ్చుతున్నారు. ఇటీవల బదిలీపై 40 మంది వరకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన కౌన్సిలింగ్ లో ఎస్ జి టి ఉపాధ్యాయులు కూడా బదిలీ అయ్యేవిధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతోచాట్రాయి మండలం నుండి బదిలీలు అధికంగా జరిగాయి జిల్లాకు దూరంగా ఉండటంతో చాట్రాయి మండలానికి కౌన్సిలింగ్ లో వచ్చే అవకాశాలు కనబడటం లేదు. దీంతో వెనుకబడిన చాట్రాయి మండలంలో ఉపాధ్యాయుల భర్తీ ఏ విధంగా జరుగుతుందో వేసి చూడాల్సిందే. చాట్రాయి మండలంలో పది పాఠశాలలో అసలు ఉపాధ్యాయులు లేకుండా మూతపడగా మరో 25 పాఠశాలలు ఒకే ఉపాద్యాయుడుతో నడుస్తున్నాయి ఈ పాఠశాలలో ఉపాద్యాయుడు సెలవు పెడితే ఆరోజు ఆ పాఠశాలకు సెలవే ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలు నడుస్తుంటే విద్యార్థులను ఏ విధంగా చేర్చించాలని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. జూలై నెలకైనా ఉపాధ్యాయులను భర్తీ చేస్తే విద్యార్థులకు మేలు జరుగుతుందని పలువురు తెలియజేస్తున్నారు.దీనిపై ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఉపాధ్యాయులు భర్తీకి సన్నాహాలు ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు.ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది అధికారులు, ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేస్తేనే పాఠశాల మనుగడ సాధ్యమవుతుందని మండల ప్రజలు కోరుకుంటున్నారు.నూజివీడు శాసనసభ్యులు మరియు మంత్రి కొలుసు పార్ధసారధి చాట్రాయి మండలం పై ప్రత్యేక దృష్టి సారించి విద్యావ్యవస్థను పునరుద్ధరించి పాఠశాలల మనుగడకు ఇబ్బంది లేకుండా చేయాలని మండల ప్రజలు విద్యాధికులు కోరుతున్నారు.

