BREAKING
చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం
www.ntodaynews.com

ఉపాధిహామీ పథకాన్ని కాపాడాలి

తెలంగాణ
05 Feb, 2026 - 07:46 AM
192 వీక్షణలు
ఉపాధిహామీ పథకాన్ని కాపాడాలి: పుంగనూరులో వైఎస్ షర్మిల పరిరక్షణ యాత్ర కేంద్ర కొత్త చట్టంతో కూలీలకు నష్టం జరుగుతోందని ఆరోపణ NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్ర రాజు  మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని దేశవ్యాప్తంగా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉపాధిహామీ పరిరక్షణ యాత్ర పుంగనూరుకు చేరుకుంది. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేతృత్వంలో ఈ యాత్ర మదనపల్లి, పుంగనూరు ప్రాంతాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం వల్ల ఉపాధిహామీ కూలీలకు తీవ్ర నష్టం జరుగుతోందని విమర్శించారు. మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకాన్ని, అలాగే మహాత్మాగాంధీ పేరును కూడా కేంద్రం, రాష్ట్రం రెండూ నిర్వీర్యం చేయాలని చూస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఉపాధిహామీ పథకానికి నిధులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే సమకూర్చిందని, అయితే తాజా ప్రతిపాదనలో రాష్ట్రం 40 శాతం, కేంద్రం 60 శాతం నిధులు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఈ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆరోపిస్తూ, ఇప్పటికే రాష్ట్రం భారీ అప్పుల్లో ఉన్న పరిస్థితిలో ఈ నిధులను ఎలా సమకూరుస్తారంటూ ప్రశ్నించారు. ఈ యాత్రలో మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు భాస్కర్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ మురళి మోహన్ యాదవ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #EmploymentGuarantee #MGNREGS #YSSharmila #CongressProtest #EmploymentRights #Punganur #AnnamayyaDistrict Follow us on Website Facebook Instagram YouTube