పైడిపల్లి పంచాయతీ బీఆర్ఎస్ సర్పంచ్ విజేతలను సత్కరించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
NTODAY NEWS: వెల్గటూర్,
వెల్గటూర్ మండలంలోని పైడిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా విజేతలను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం ప్రత్యేకంగా అభినందించారు.
ఘనంగా సన్మానం:
పైడిపల్లి సర్పంచ్‌గా ఎన్నికైన గంగుల మంగ–నగేష్ దంపతులతో పాటు, గెలుపొందిన వార్డు సభ్యులను కొప్పుల ఈశ్వర్ శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని ఆయన విజేతలకు సూచించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించిన పైడిపల్లి ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గంగుల అశోక్, పార్టీ మండల అధ్యక్షులు రాంచందర్ గౌడ్, సింహాచలం జగన్ పాల్గొన్నారు. వీరితో పాటు నాయకులు జూపాక కుమార్, మూగల సత్యం, వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొని విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.













