జూలై 22న జరిగే GMPS జిల్లా మహాసభను జయప్రదం చేయాలి

Spread the love

జూలై 22న జరిగే GMPS జిల్లా మహాసభను జయప్రదం చేయాలి

NTODAY NEWS: బొమ్మలరామారం.

జూలై 22న రాయిగిరి లింగ బసవ గార్డెన్లో జరిగే గొర్రెలు,మేకల పెంపకందారుల సంఘం GMPS యాదాద్రి భువనగిరి జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి మద్దెపురం రాజు పిలుపునిచ్చారు. ఆదివారం రోజున మర్యాల గ్రామంలో ఉన్న కురుమ సంఘం భవనం ఆవరణలో GMPS జిల్లా మహాసభల కరపత్రం ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాసభలకు గొల్ల, కురుమలు గొంగళ్ళు, డోలు, తాళం, గజ్జెలు ధరించి అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. గొల్ల, కురుమలు, గొర్రెల మేకల పెంపకందారులు తమ సమస్యల పరిష్కారానికై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. గొర్లు మేకలకు మేత, నీరు, వైద్యం,గొర్రెలకు భీమా, గొర్ల కాపరులకు 50సం.లకు పింఛన్లు, సబ్సిడీ రుణాలు, ఎక్స్గ్రేషియో, చదువుకున్న యువతీ, యువకులు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గొల్ల కురుమల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న ఏకైక సంఘం గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం GMPS అని కొనియాడారు. రెండో విడత గొర్ల పంపిణీ నగదు బదిలీ ద్వారా అమలు చేస్తామని కామారెడ్డి బిసి డిక్లరేషన్ కాంగ్రెస్ మేనిఫెస్టో 15,16 పేజిలలో రెండు లక్షల నగదు బదిలీ అధికారంలోకి వచ్చిన మూడు నెలలలో చేస్తామని హామీ ఇచ్చిన హామీని అధికారం చేపట్టి 18 నెలలు అయిన అమలు చేయలేదని, పదేళ్లుగా సొసైటీలకు ఎన్నికలు జరపలేదని, రెండున్నర సంవత్సరాలుగా గొర్రెలు, మేకలకు డీవార్మింగ్, 8నెలలుగా మందుల సరఫరా పూర్తిగా నిలిచి పోయిందని, తొమ్మిది నెలలుగా గోపాలమిత్రలకు వేతనాలు ఇవ్వడం లేదని విమర్శించారు. రోగాలతో గొర్లు మేకలు చనిపోతున్నాయని ప్రభుత్వం నుండి ఎలాంటి మందులు అందడం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బుడుమ శ్రీశైలం, మండల ప్రధాన కార్యదర్శి జెట్టా చిరంజీవి, గ్రామ శాఖ అధ్యక్షులు చీర గణేష్, బండ శ్రీధర్, పిడుగు జహంగీర్, బండ రమేష్, బండ రంగాలు, ర్యాకల కుమార్, బాండ్ర భాస్కర్, గూదే మల్లేష్, ఒగ్గు బాలయ్య, చీర బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »