ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం — భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
(NTODAY NEWS)
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారూ. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, స్థానిక కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం వెలిలిమినేడు గ్రామంలో నైట్ ఆల్ట్ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బస్సు ఎక్కి కొద్ది దూరం ప్రయాణించారు . అనంతరం మీడియాతో భువనగిరి ఎంపీ మాట్లాడుతూ స్థానిక ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని అందులో భాగంగానే ఈరోజు స్థానికుల అవసరాల మేరకు నైట్ హాల్ట్ బస్సును ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే చిట్యాల సంబంధించి మరో అయిదు అదనపు బస్సులను ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అనంతరం వట్టిమర్తిలో మొదటి విడతగా గ్రామంలో 55 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ఈ ప్రజా పాలనలో ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రతి నిరుపేద, బలహీనవర్గాలకే ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అమలయ్యేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, త్వరలోనే భూమాత పోర్టల్ అందుబాటులోకి వచ్చి రైతుల సమస్యలను తీర్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.