తెలంగాణలో భూస్వాముల దౌర్జన్యాలను ఎదిరించి పోరాడిన చరిత్ర ఎర్రజెండాదే

Spread the love

తెలంగాణలో భూస్వాముల దౌర్జన్యాలను ఎదిరించి పోరాడిన చరిత్ర ఎర్రజెండాదే
మహత్తర పోరాటానికి మతంరంగు పులుముతున్న బిజెపి
చార్మినార్ సీపీఎం సభలో ఎం.డి అబ్బాస్

NTODAY NEWS: హైదరాబాద్

తెలంగాణలో భూస్వాముల దౌర్జన్యాలకు, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా సామాన్య ప్రజలను చైతన్య పరిచి సాయుధ పోరాటం నిర్వహించిన చరిత్ర ఎర్రజెండా దేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం డీ అబ్బాస్ అన్నారు. నేడు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సిపిఎం హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటి శాలిబండ నుండి చార్మినార్ వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం చార్మినార్ వద్ద సభ నిర్వహించారు. సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగం చేశారు. ఆయన ఈ సభలో మాట్లాడుతూ 4000 మంది ప్రాణత్యాగాలతో, లక్షల ఎకరాల భూస్వాముల భూముల్ని స్వాదీనం చేసుకుని పేదలకు పంపిణీ చేసిన ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటానికి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం వహించిందన్నారు. భూస్వాములను గ్రామాలనుండి తరిమి కొట్టి, గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేసి, ప్రజాపాలన అంటే ఏమిటో ప్రజలకు చూపించారు కమ్యూనిస్టులని అన్నారు. వెట్టిచాకిరీని కమ్యూనిస్టు పార్టీ నిర్మూలించింది, పన్నుల చెల్లింపు నిలిపివేశారు. ఫలితంగా నైజామ్ రాజుకు దిక్కు తోచక ఇండియన్ గవర్నమెంటుతో రాజీ కుదుర్చుకున్నాడని దానిలో భాగంగానే ఆనాటి కేంద్ర కాంగ్రెస్ హోమ్ మంత్రి వల్లభాయ్ పటేల్ సైన్యాన్ని పంపించాడని, కమ్యూనిస్టు ఉద్యమాన్ని అణచివేసి, ప్రజలు సాధించిన విజయాలను కాలరాసేందు భూస్వాములతో కలిసి కుట్ర చేశారని తెలిపారు. నిజామ్ రాజుకు రాజాభరణాలు ఇచ్చారని, ఇదీ చరిత్ర అని, ఈ వాస్తవాలు నేటి తరానికి చెప్పాలని అన్నారు. బిజెపి ఈ చరిత్రకు మతం రంగు పులిమి ముస్లిం రాజుకు, హిందువులకు జరిగిందని అబద్ధాలు చెప్తున్నదని బిజెపి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాటి చారిత్రక పోరాటంతో ఎలాంటి సంబంధం లేని బిజెపి విమోచన దినం పేరుతో హడావుడి చేయడం సిగ్గుచేటన్నారు. బిజేపి అబద్ధాలను ప్రజలలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. చార్మినార్ జోన్ సిపిఎం కన్వీనర్ అబ్దుల్ సత్తార్ అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా నాయకులు ఎం మీనా, జి. విటల్, పి. నాగేశ్వర్, ఎల్. కోటయ్య, ఎం శ్రవణ్ కుమార్,ఎం. బాలు, బాబార్ ఖాన్, ఎస్‌ కిషన్, ఏ కృష్ణ, కే.జంగయ్య, మరియు ప్రజా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. ఎర్ర జెండాలు పట్టుకొని సిపిఎం శ్రేణులు నిర్వహించిన ర్యాలీ ఆ ప్రాంత ప్రజలను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నది.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »