BREAKING
తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు
www.ntodaynews.com

స్వామివారిని దర్శించుకున్న ఇంచార్జి కలెక్టర్

తెలంగాణ
01 Jan, 2026 - 09:23 AM
237 వీక్షణలు

భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే

NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ లక్ష్మణ్ వేములవాడ: వేములవాడలో భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గురువారం భీమేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే వెళ్లగా ఆలయ అర్చకులు స్వస్తితో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్, ఎస్పీ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంచార్జి కలెక్టర్, ఎస్పీతో పాటు వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి, ఆర్డీఓ రాధాభాయ్‌లకు అర్చకులు స్వామివారి ప్రసాదం అందజేసి ఆశీర్వచనం చేశారు. ఏర్పాట్ల పరిశీలన సమ్మక్క–సారలమ్మ జాతర, మహా శివరాత్రి నేపథ్యంలో ఆలయంలో తాగునీటి సరఫరా, ప్రసాదం కౌంటర్ల వద్ద ఏర్పాట్లు, పార్కింగ్ ఏరియా, టాయిలెట్లు, షవర్ స్నానాల ఏర్పాట్లు, కోడె మొక్కుల టికెట్ కౌంటర్, వీఐపీ, వీవీఐపీ, ప్రత్యేక దర్శనం క్యూలైన్లు, నీటి సరఫరా ఏర్పాట్లను ఇంచార్జి కలెక్టర్, ఎస్పీ కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. బద్ది పోచమ్మ ఆలయం వద్ద నూతన భవనం స్లాబ్ పనులు పూర్తి చేసి ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఇంచార్జి కలెక్టర్ ఆదేశించారు. భీమేశ్వర, బద్ది పోచమ్మ ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. ఈ పరిశీలనలో ఆర్ అండ్ బీ ఈఈ నరసింహాచారి, ఆలయ ఈఈ రాజేష్, డీఈ రఘునందన్, తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube