వామపక్ష ఉద్యమానికి తీరని లోటు

Spread the love

వామపక్ష ఉద్యమానికి తీరని లోటు– సిపిఎం మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్

NTODAY NEWS: తుర్కపల్లి

శనివారం రోజున తుర్కపల్లి మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సిపిఐ అఖిలభారత మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారి మృతికి విప్లవ జోహార్లు తెలియజేస్తూ సంతాపం ప్రకటిస్తూ పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్ మాట్లాడుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సురవరం సుధాకర్ రెడ్డి గారు లేని లోటు వామపక్ష ఉద్యమానికి తీరని లోటు అని వ్యక్తం చేశారు ఆయన ఒక గొప్ప మేధావిగా సాహితీవేత్తగా వామపక్ష ఉద్యమ నిర్మాతగా విద్యార్థి యువజన నాయకుడుగా ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆల్ ఇండియా కార్యదర్శిగా అధ్యక్షుడిగా సేవలందించారని సిపిఐ లో 3 సార్లు అఖిలభారత కార్యదర్శిగా రెండు పర్యాయాలు ఉమ్మడి నల్లగొండ పార్లమెంటేరియన్ సభ్యులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా సేవలందించారని నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన గొప్ప వ్యక్తి అని నల్లగొండ ఫ్లోరైడ్ నీటికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపాడని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ పోరాటాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉండి పోరాటాన్ని అగ్రభాగాన్ని నిలిపిన నాయకుడని కొని ఆడారు వారి మరణం కుటుంబానికే కాక వామపక్ష ఉద్యమానికి తీరనిలోటు అని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు కొక్కొండ లింగయ్య,తలారి మాతయ్య,ఆవుల కలమ్మ,కోట నాగరాజు,భూక్య లక్ష్మి,సిఐటియు నాయకులు గుండెబోయిన బలరాం,కట్కూరి వెంకటేశం,పల్లె వెంకటేశం,ప్రజా సంఘాల నాయకులు బానోత్ హిరాలాల్, బోళ్ల ప్రహ్లాద, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »