వెన్నెపోటును, గొడ్డలి పోటును పేటెంట్‌గా తీసుకున్నారు

Spread the love

వెన్నెపోటును, గొడ్డలి పోటును పేటెంట్‌గా తీసుకున్నారు

ఏలూరు, జూన్‌ – 03…

వైఎస్‌ కుటుంబం వెన్నెపోటును, గొడ్డలి పోటును పేటెంట్‌గా తీసుకుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి విమర్శించారు. సొంతచెల్లికి, తల్లికి వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్‌ రెడ్డి ఇప్పుడు వెన్నుపోటు దినం నిర్వహించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఏలూరులో మంగళవారం ఆయన ఒక ప్రకటన చేస్తూ జగన్మోహన్‌ రెడ్డి, గత వైసిపి పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో రాజారెడ్డి తనగనుల్లో ఉపాధి కల్పించిన వెంకట నర్సయ్యకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. జగన్‌ తన కన్నతల్లికి, సొంతచెల్లికి ఆస్తి కోసం వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. చివరకు ఐదేళ్ళు అధికారం ఇచ్చిన ప్రజలకు సైతం జగన్‌ వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఒక్క హామీకూడా అమలు చేయలేదని జగన్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖడించారు. గత ఐదేళ్ళ వైసిపి పాలనలో ఏపి సర్వనాశనం అయ్యిందని, తిరిగి రాష్ట్రాన్ని అభివృద్ధిబాట పట్టించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు పాటుపడుతున్నారని ఆయన గుర్తుచేశారు. తొలిఏడాదిలో కనీసం పదిశాతం హామీలను కూడా అమలు చేయని జగన్మోహన్‌ రెడ్డి,,, కూటమి ప్రభుత్వం తొలిఏడాదిలోనే 70శాతం హామీలను అమలు చేయడం చూసి ఓర్వలేక ప్రజల దృష్టిని మళ్ళించడానికి ధర్నాల డ్రామా ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం పెన్షన్‌ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలు చేసిందని, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాతా సుఖీభవ అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించిందన్నారు. అలాగే 16,347 పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చి ఉపాధ్యా య పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టామని గుర్తుచేశారు. రాష్ట్రంలో రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం పూర్తిచేశామని, అంతేకాకుండా 12వందల కోట్ల రూపాయలతో 20వేల కిలోమీటర్ల రోడ్లు బాగుచేసినట్లు తెలిపారు. ఇదేకాకుండా ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తుంటే అసలైన వెన్నుపోటుదారుడైన జగన్మోహన్‌ రెడ్డి వెన్నుపోటు అంటూ ధర్నాలు చేయడం దొంగే దొంగ అన్నట్లుగా ఉందని ఆయన మండిపడ్డారు. జగన్‌ ముఠా దుష్ప్రచారాలు తిప్పికొట్టి రాష్ట్ర బంగారు భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఆయన అభిప్రాయప్డారు…

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top