రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంలో పబ్లిక్ రిలేషన్స్ పాత్ర చాలా ముఖ్యమని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరు హనుమంత్ కే.జండగే అన్నారు.సోమవారం నాడు జిల్లా గజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా పౌర సంబంధాల అధికారి పి.వెంకటేశ్వరరావు పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి జిల్లా కలెక్టరు ముఖ్య అతిథిగా హాజరైనారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం నిరంతరం చేపట్టే అభివృద్ధి పథకాలు, ప్రజల మేలు కోరే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించడంలో, వాటి ప్రాముఖ్యతను తెలియచెప్పడంలో పబ్లిక్ రిలేషన్స్ పాత్ర ఎనలేనినదని, జిల్లా యంత్రాగంతో, మీడియాతో అనుసంధానంగా ఉండి అలాంటి పబ్లిక్ రిలేషన్స్ బాధ్యతను జిల్లా పౌర సంబంధాల అధికారి పి.వెంకటేశ్వరరావు నిర్విఘ్నంగా నెరవేర్చారని అన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉద్యోగులు క్షేత్రస్థాయి నుండి అద్వితీయ పాత్ర పోషిస్తూ జిల్లాను ముందంజలో నిలుపుతున్నారన్నారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు కె.గంగాధర్, మీడియా ప్రతినిధులు, రాష్ట్ర గజిటెడ్ ఉద్యోగుల సంఘం ట్రెజరర్ మందడి ఉపేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శోభారాణి, జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జగన్మోహన్ ప్రసాద్, జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply