ఎల్బీనగర్ సెప్టెంబర్ 30) NToday News. ప్రతినిధి
తిరుపతి లడ్డూ వివాదంపై విశ్వహిందూ పరిషత్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న — గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..!!!
హైదరాబాద్, సెప్టెంబర్ 30, 2024 – కొత్తపేటలోని ఓమ్నీ హాస్పిటల్ చౌరస్తా వద్ద వివేకానంద నగర్ జిల్లా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పాల్గొనడం జరిగింది.
ఈ సందర్బంగా తిరుపతి లడ్డూ వివాదంపై అవగాహన కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ హిందూ నాయకులు, కార్యకర్తల నేతృత్వంలో నిరసన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్బంగా కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మాట్లాడుతూ, తిరుపతి లడ్డు వివాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. హిందూ దేవాలయాల పై ప్రభుత్వ పెత్తనం వైదొలగాలి. దేవాలయాలలో అన్యమత ఉద్యోగస్తులను వెంటనే తొలగించాలి, అన్యాక్రాంతమైన దేవాలయ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలి, దేవాలయ స్థిర చర ఆస్తులను పరిరక్షించుకోవాలి. దేవాదాయ శాఖను రద్దు చేయాలి. దేవాలయ వాణిజ్య సముదాయాలలో దుకాణాలను హిందువులకే ఇవ్వాలి. తెలంగాణ ప్రభుత్వం దేవాలయాలలో పూజ ప్రసాదాల తయారీకి ఉపయోగిస్తున్న వస్తువులపై అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించాలి.
ఈ నిరసనలో విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్, బీజేపీ రంగారెడ్డి (అర్బన్) జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, బీజేపీ జిహెచ్ఎంసి కార్పొరేటర్లు, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర, జిల్లా నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, దేవాలయ కమిటీలు, గణపతి నవరాత్రి ఉత్సవ సమితి సభ్యులు, తిరుమల తిరుపతి సేవకులు, యువజన సంఘాలు తదితరులు పాల్గొన్నారు.