జర్నలిస్టుల సంక్షేమమే టి యు డబ్ల్యూ జే (ఐజేయు) లక్ష్యం — జిల్లా ఉపాధ్యక్షులు ఏళ్ల బయన్న,
ఫీజు రాయితీ తో జర్నలిస్టులకు ఊరట —- కార్యదర్శి పెద్ది నరేందర్
NTODAY NEWS
రిపోర్టర్ కూనూరు మధు
నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు చదువుతున్న జర్నలిస్టు పిల్లలకు 50% రాయితీ ఇవ్వాలని డి.ఈ.ఓ.కు టియుడబ్ల్యూజే(ఐజేయు) నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జూన్ 4న వినతి పత్రం అందజేశారు. దానికి స్పందిస్తూ డిఇఓ అన్ని ప్రైవేట్ పాఠశాలలో చదివే జర్నలిస్టు పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా టి.యు.డబ్ల్యూ.జే (ఐ జే యు) జిల్లా ఉపాధ్యక్షుడు ఏళ్ల బయన్న మరియు జిల్లా కార్యదర్శి పెద్ది నరేందర్ మాట్లాడుతూ ఫీజు రాయితీ జర్నలిస్టుల విజయమని, జర్నలిస్టుల సేవలను గుర్తించి డిఇఓ తీసుకున్న నిర్ణయం ఎంతో హర్షణీయమని, ఫీజు రాయితీ జర్నలిస్టులకు ఊరటగా ఉంటుందని , జర్నలిస్టు అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని, తెలియజేశారు.