క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన జడ్పీ చైర్ పర్సన్

Spread the love

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన జడ్పీ చైర్ పర్సన్

NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్

రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా BRS నాయకులతో కలిసి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్. పాపులను సైతం క్షమించమనే త్యాగశీలత, ఓర్పు, సహనం, మానవ సమాజానికి క్రీస్తు చూపిన అత్యద్భుతమైన అహింసా–శాంతి మార్గమని అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్రిస్టియన్ మైనారిటీలకు అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దేశానికే ఆదర్శంగా అమలు చేశామని తెలిపారు. క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు మరియు ఏసుక్రీస్తు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బర్కాం మల్లేష్ ప్రధాన కార్యదర్శి రత్నాకర్ రావు మాజీ ఎంపీటీసీ వెంకటేష్ వార్డ్ సభ్యులు ప్రశాంత్ నాయకులు ముదం శ్రీను బలరాం లింగన్న పద్మయ్య దేవి భీమన్న పాస్టర్లు క్రైస్తవ సోదరీ సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »