మా బాధలు పట్టించుకునే నాథుడే లేడు….

Spread the love

బయో డీజిల్ కంపెనీ కాలుష్యాన్ని,దుర్వాసనను మింగి ఓపిక వహిస్తున్న గ్రామ ప్రజలు

మోడల్ స్కూల్, హాస్టల్ విద్యార్థులు మరి తీవ్రమైన ఇబ్బంది గురవుతున్నారు

పట్టించుకోని కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు.

ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి కుర్మతి – రమేష్
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపుర్ లో గ్రామానికి అనుకొని దాదాపు ఇండ్ల మధ్యలోనే బయోడీజిల్ కంపెనీ పరిశ్రమను గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించారు. అసలే ఇక్కడి ప్రాంతంలో సాగునీరు లేక, పడవుబడిన భూములు, యువతకు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మన ప్రాంతంలో ఒక కంపెనీ ఏర్పడుతుందన్న ఆనందంలో ఉపాధి దొరికి, బ్రతుకులు బాగుపడతాయని గ్రామస్తులందరూ స్వాగతిం చారు. అనుకున్నట్టే స్థానికులకు 50 నుంచి 60 మందికి గ్రామానికి చెందిన స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు, ఇంతవరకు బాగానే ఉంది. పరిశ్రమలో బయో డీజిల్ తయారీ కొరకు ఉపయోగించే వివిధ రకాల రసాయనల కలయికతో ఏర్పడిన కాలుష్యాన్ని గత కొన్ని ఏళ్లుగా అర్ధరాత్రి సమయంలో గంట లేదా రెండు గంటల పాటు వదిలేవారు. ఆ సమయంలో గ్రామంలోని ప్రజలం దరికీ కొంత దుర్వాసన వచ్చినా దుమ్ము, దుళ్, ఇండ్లపై, ఉతికి ఆరేసిన బట్టల పై వాడుకునే నీళ్లపై పడిన రాత్రి సమయంలో కాబట్టి చూసి చూడనట్టు వ్యవహరించారు. ముఖ్యంగా గ్రామ బిడ్డలకు ఎంతో కొంత బ్రతుకుతెరువు దొరుకుతుందిలే అని బయో డీజిల్ కంపెనీ ద్వారా విడుద లయ్యే కాలుష్యాన్ని, దుర్వాసను కూడా మింగి ఓపికతో మౌనంగా వ్యవహరించారు.
గ్రామస్తులు. గ్రామస్తుల మౌనాన్ని కొంత మంది.రాజకీయ నాయకులు తమ ఖాతాలో వేసుకొని కంపెనీ యాజమాన్యం దగ్గర మన్ననలు పొందుతున్నట్టు తెలియవచ్చింది. దీనినే కంపెనీ యాజమాన్యం ఆసరాగా తీసుకొని కంపెనీ ఏర్పాటు దశలో రెండు, మూడు సంవత్సరాలపాటు గంట రెండు గంటలు అర్ధరాత్రి సమయంలో వదిలే దుర్వాసన కలిగిన వాయి కాలుష్యాన్ని, ఇప్పుడు ప్రస్తుతం కంపెనీ వేర్లు విస్తరించి దృఢంగా మారినందున. స్థానిక లీడర్లతో, అధికారులతో పూర్తిస్థాయిలో పరిచయాలు ఏర్పడడంతో, ఇప్పుడు కంపెనీ ఉదయం, రాత్రి అనే తేడా లేకుండానే వివిధ రకాల రసాయనాలతో డిజిల్ తయారు చేసే ప్రక్రియలో భాగంగా దుర్వాసన వెదజల్లే వాయు కాలుష్యాన్ని వదులుతున్నారు. దీంతో పదివేల జనాభా గల గ్రామం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. 70 మంది ఉపాధిని చూసుకుంటే పదివేల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తుంది. ఉదయం, రాత్రి అనే తేడా లేకుండానే ముక్కులు బద్దలయ్యే దుర్గంధం, పీల్చే గాలి కూడా విషపూరితం, దీంతో గ్రామంలోని ప్రజలను ముంచెత్తిన కొత్త రోగాలు, కంపెనీ నుండి వెదజల్లే వాయు కాలుష్యాన్ని రోజు పీల్చితే గర్భవతులకు, పుట్టబోయే బిడ్డలకు ప్రమాదమని డాక్టర్లు సూచిస్తున్నారు. ఆస్తమా రోగుల అవస్థలు అన్నీ ఇన్ని కాదు. చిన్నపిల్లలకు ప్రమా దం పొంచి ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.. కంపెనీకి కూతవేట దూరంలోనే మోడల్ స్కూల్, హాస్టల్ విద్యార్థులకు మరి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల యోగక్షేమాలు చూసేవారెరి ? గ్రామంలోని ప్రజలకు కొత్త కొత్త రోగాలతో పడుతున్నారు. ఏంటంటే విడుదల చేసే అధికారులకు వారు అందుకే వారు పక్షాన పరిష్కరించారు గ్రామంలోని సోషల్ కంపెనీ వచ్చే నల్లటి వారం తీరును పెడుతున్నారు సమస్యను లేని ఇబ్బంది, లేదు.? కంపెనీ తయారీ ప్రారంభించినట్టు ప్రారంభిస్తే దుర్వాసన అనారోగ్య బారిన అసలు విషయం బయో డీజిల్ కంపెనీ దుర్వాసన ఇబ్బందులు ప్రజాప్రతినిధులకు, లీడర్లులకు, తెలియదు. ఎందుకంటే స్థానికంగా ఉండరు కాబట్టి ప్రశ్నించారు, ప్రజల నిలబడరు, సమస్యను ప్రతిరోజు వాట్సప్ గ్రూపుల్లో మీడియాలో బయో డీజిల్ విడుదల చేసే దుర్వాసన, దుమ్ము, కండ్లల్లో పడితే రోజులకు పైగా పోవడం లేదని బాధపడుతున్న ఫోటోలను తీసి సోషల్ మీడియాలో అయినా సరే ఎవరు స్పందించారు. కంపెనీ ప్రారం భం దశలో ఇప్పుడు ఎందుకు వస్తుందో అర్ధం కావడం అధిక లాభం ఆర్జించే ందుకు, డిజిల్ ప్రక్రియలో వాడకుడని రసాయ నాలను వాడటం తెలుస్తుంది. ఈ విధమైన ప్రక్రియల మాత్రం వెంటనే దానిని నిలుపుదల చేసి వెదజల్లని, గ్రామస్తులు ఇబ్బం దులకు గురికాని డీజిల్ ప్రక్రియ ఏదైతే ఉంటుందో దానిని కొనసాగించాలని కోరుకుంటున్నారు గ్రామ ప్రజలు. అతి తొందరలో మార్చు రాకుంటే గ్రామ ప్రజల నుంచి తిరుగు బాటు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇక కాలుష్య నియంత్రణ బోర్డ్ అధికారులు ఇటువైపు వచ్చిన దాఖలాలు లేవు తనిఖీ చేసిన సందర్భము లేదు. స్థానిక లీడర్ల మాదిరిగానే అధికారులు కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. గ్రామ ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలంటే బయోడీజిల్ కంపెనీ సమస్యను పరిష్కరించుకోవడమా ? గ్రామం ఖాళీ చేసి పోవడమా గ్రామస్తులే నిర్ణయించుకోవాలె. సమస్య పరిష్కారానికి స్థానిక ప్రజా ప్రధినిధులు ఆధికారులు ఏంచేస్తారో వేచి చూడిల్సిందే.