నాగినేనిపల్లి గ్రామం అభివృద్ధిలో శూన్యం,అవినీతిమయం — ఇప్పలపల్లి నరేందర్
NTODAY NEWS:యాదాద్రి భువనగిరి జిల్లా,
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నాగినేనిపల్లి గ్రామ సర్పంచ్ గా పోటీ
యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, నాగినేనిపల్లి గ్రామంలో అభివృద్ధి శూన్యం ఎక్కడ చేసిన గొంగడి అక్కడే ఉండే విధంగా చేపట్టిన పనులు ఉన్నాయని ఇప్పలపల్లి నరేందర్ అన్నారు శుక్రవారం రోజున ఎన్ టుడే న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ప్రత్యేక ధన్య వాదాలు తెలుపుతున్నామని అన్నారు ప్రజాసేవ చేయడానికి ఇద్దరు పిల్లల నిబంధన ఉండడంతో నాలాంటి వాళ్లు ఎంతోమంది సమాజంలో ప్రజా ప్రతినిధిగా ప్రజాసేవ చేయలేకపోయామని అన్నారు గ్రామంలో గత పది సంవత్సరాలుగా గ్రామ అభివృద్ధి పేరుతో తాజా మాజీ సర్పంచ్,గ్రామంలో ఉన్న ప్రజా ప్రతినిధులు తన సొంత లాభాల కోసం ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయన్నారు గ్రామంలో ఉన్న కాలనీలలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదన్నారు వేసిన రోడ్లకు మళ్లీ టెండర్లు వేసి రోడ్లు వేస్తామనడం ఎంతవరకు సమంజసం అని అన్నారు గత ప్రభుత్వంలో సర్పంచ్ గా పోటీ చేసి అప్పుల పాలయమై అని చెప్పి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచిగా పోటీ చేస్తానడం ఎంత అవినీతి జరిగిందో ఇదే నిదర్శనం గత కొన్ని సంవత్సరాలుగా నూతన గ్రామపంచాయతీ నిర్మాణమైన బిల్డింగును ప్రారంభోత్సవం చేసుకోవడంలో ప్రజాప్రతినిధుల అలసత్వంతో ప్రారంభోత్సవం చేసుకోలేక ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తున్నారని అన్నారు గ్రామంలో ఉన్న రెవిన్యూ పట్టా భూములలో వెంచర్లు చేసిన గ్రామపంచాయతీ రావలసిన డెవలప్మెంట్ చార్జెస్ విషయంలో అవతగతలు జరిగాయని అన్నారు గ్రామపంచాయతీ నిధులకు రావలసిన కోట్ల రూపాయలు పక్కదారి పోవడానికి గ్రామ ప్రజా ప్రతినిధులే కారణమని అన్నారు గ్రామంలో ప్రభుత్వ భూములు బడా బాబులు అక్రమంగా కబ్జా చేసుకున్న కూడా ప్రభుత్వాధికారులు పట్టించుకోకపోవడం గ్రామ ప్రజాప్రతినిదుల సహాయ సహకారాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి అని అన్నారు అలాంటి ప్రభుత్వ భూములను సేకరించి కంపెనీలు పెట్టిస్తే గ్రామ ప్రజలకు నిరుద్యోగ సమస్యలు తీరుతాయన్నారు గ్రామ ఊరి డ్రైనేజీ వ్యవస్థను చెరువులో కలపడం మంచి పద్ధతి కాదని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు గ్రామ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు రాబోయే సర్పంచ్ ఎన్నికలలో రిజర్వేషన్లు ఎస్సీ వచ్చిన జనరల్ వచ్చిన గ్రామ సర్పంచిగా పోటీకి నిలబడతానని ఎన్ టుడే న్యూస్ ప్రతినిధితో తెలిపారు.

