ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు తప్పక టీచర్లకు సెలవులు అమలు చేయాలని TPTLF డిమాండ్.
హైదరాబాద్ సెప్టెంబర్ 30/ Ntody News ప్రతినిధి.
రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ కార్పోరేట్ స్కూల్స్ అన్నీ తప్పక సెలవులు టీచర్లకు కూడా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ (TPTLF) రాష్ట్ర కమిటీ ఆద్వర్యంలో పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ ఇవీ నర్సింహా రెడ్డి ఐఏఎస్ కి మెమొరాండం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వారిలో రాష్ట్ర కన్వీనర్ ఏ. విజయ్ కుమార్, హైదరాబాద్ నాయకులు డి. సైదులు ఉన్నారు.
అనంతరం రాష్ట్ర కన్వీనర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖ విద్యా సంస్థలకు దసరా సెలవులను అక్టోబర్ 2 నుండి 12వ తారీకు వరకు ప్రకటించింది. ఆ సెలవులు విద్యార్థులకే కాక, టీచర్స్ కి వర్తిస్థాయని తెలిపారు.
రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ కార్పోరేట్ పాఠశాలలు కొన్ని విద్యార్థులకు మాత్రమే మొత్తం సెలవులు ఇచ్చి , టీచర్స్ కి సెలవులు ఇవ్వడం లేదు. సెలవు తేదీల్లో అనగా అక్టోబర్ 2,3 తేదీల్లో కూడా లేదా 3,4 నాలుగు తేదీల్లో ఆ సంస్థలు టీచర్స్ కి వర్క్ షాప్ లు లేదా ఇతర పనులు చెప్పి విద్యాసంస్థలకు రప్పించడం చేస్తున్నారనీ ఇదీ సరైనది కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అన్నీ ప్రైవేట్ పాఠశాలలు తప్పక సెలవులు టీచర్లకు కూడా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఇవ్వని వాటిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని వారు అన్నారు.
మెమొరాండం DSE కి ఇవ్వగానే ఆయన తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Leave a Reply