వట్లూరు గురుకుల పాఠశాలలో శిక్షణా కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కెపాసిటీ బిల్డింగ్ శిక్షణా కార్యక్రమం ఏలూరు జిల్లాలోని వట్లూరులో ప్రారంభమైంది. జూన్ రెండవ తారీఖు నుండి నాల్గవ తారీఖు వరకు మూడు రోజులు జరిగే
ఈ శిక్షణా కార్యక్రమంకు జోన్-2 లోని సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల ప్రిన్సిపాల్స్ హాజరవుతారు.విద్యా వ్యవస్థలోని నూతన విధానాలు, సంస్థాగత ప్రణాళికలు గురించి ఈ శిక్షణ కార్యక్రమంలో చర్చించడం జరుగుతుందని వట్లూరు కళాశాల ప్రిన్సిపాల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి గారు అన్నారు. ఈ కార్యక్రమంలో అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ నుండి శ్రీ.ప్రవీణ్ నాయుడు గారు, శ్రీ. తిరంగ్ గారు, కళాశాల ప్రిన్సిపల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి గారు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.