టీయూడబ్ల్యూజే (ఐజెయూ) మండల కమిటీ ఎన్నిక
NTODAY NEWS
టియుడబ్ల్యూజె ( ఐజెయు) చిట్యాల మండల నూతన కార్యవర్గాన్ని మంగళవారం జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కలిమల నాగయ్య, సీనియర్ నాయకులు దోసపాటి సత్యనారాయణ,మాదరి యాదగిరి,దొతి శ్రీనివాస్, ఏళ్ల బయన్నల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల శాఖ అధ్యక్షలుగా మెండే వెంకన్న,(ఆంధ్రజ్యోతి అర్బన్) ప్రధాన కార్యదర్శిగా పోకల కరుణాకర్,(దిశ) కోశాధికారిగా చెరుపల్లి శ్రీనివాస్(సూర్య), ఉపాధ్యక్షులుగా ఏళ్ల వెంకన్న,(ఆంధ్రప్రభ) జక్కలి మహేష్, (6TV )సహాయ కార్యదర్శిగా కూనూరు మధు,(NTODAY NEWS)సూరపల్లి సూర్యనారాయణ,(ఆదాబ్ హైదరాబాద్) కార్యవర్గ సభ్యులుగా అమరోజు వెంకన్న(ప్రజా అక్షరం), జిట్ట మల్లేష్,(జనసేన) మెహర్ బాబా(మనం), గౌరవ అధ్యక్షులుగా పెద్ది నరేందర్ (ప్రజాపక్షం) సలహాదారులుగా మిరియాల ప్రకాష్ (ప్రతిపక్షం) లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన వారికి జిల్లా నాయకులు అభినందనలు తెలియజేశారు.