గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్
NTODAY NEWS రిపోర్టర్ కూనురు మధు
నల్గొండ జిల్లా చిట్యాల జల్సాలకు అలవాటు పడి, అక్రమంగా గంజాయి విక్రయిస్తూ, గంజాయి తాగుటకు బానిసలై తాళం వేసిన ఇండ్లల్లో దొంగతనాలకి పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి ల్యాప్ టాప్, 3 వాచ్ లు, ఒక సెల్ ఫోన్, 1250 గ్రాముల గంజాయి, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయినవారిలో వోడాఫోన్ ఐడియా సేల్స్ మేనేజర్ గా పనిచేస్తూ హైదరాబాద్ లో నివాస ఉంటున్న దండుగుల శివ కుమార్, ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ హైదరాబాదులో నివాసం ఉంటున్న తలారి మనోజ్ కుమార్ ఉన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ కె.నాగరాజు మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు. నల్గొండ జిల్లా ఎస్పి శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు నార్కెట్ పల్లి సి ఐ ఆద్వర్యం లో చిట్యాల ఎస్సై సిబ్బంది పలు బృంధాలు గా గాలిస్తున్న సమయం లో సోమవారం ఉదయం 6 గంటల సమయంలో నమ్మదగిన సమాచారం మేరకు చిట్యాల గ్రామ శివారులోని రైల్వే స్టేషన్ ఎక్స్ రోడ్డు వద్ద ఇద్దరు వ్యక్తుల వద్ద గంజాయి ఉన్నదని, చిట్యాల చుట్టు ప్రక్కల అవసరం ఉన్న వ్యక్తులకు గంజాయి అమ్మడం కొరకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం మేరకు చిట్యాల ఎస్సై రవి కుమార్ వారి సిబ్బందితో రైల్వే స్టేషన్ ఎక్స్ రోడ్డు వద్ద కు వెళ్ళగా అనుమానాస్పదంగా కనిపించిన పైన తెలిపిన ఇద్దరు వ్యక్తులను పట్టుబడి చేశారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్ట్ లో హాజరు పర్చా రు.

