అసైన్డ్ భూముల వెరిఫికేషన్, కుల ధృవీకరణ పత్రాల జారీ, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలి.
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.ఏలూరు, భూములు, కుల ధృవీకరణ పత్రాలజారీ అంశాలలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని డివిజనల్ రెవిన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. రాష్ట్ర రెవిన్యూ, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, భూ పరిపాలనా ముఖ్య కమీషనరు జి. జయలక్ష్మి, రెవిన్యూ, రిజిస్ట్రేషన్ ఉన్నతాధికారులు అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అసైన్డ్ భూముల ప్రక్రియ వెరిఫికేషన్, రిజిస్ట్రేషన్ తనిఖీ, భూములకు సంబంధించి, ప్రజా సమస్యల పరిష్కారవేదికకు సంబంధించిన అర్జీలు, కుల ధృవీకరణ పత్రాల జారీ అంశాలపై జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డిఆర్ఓలు, ఆర్డిఓలతో సమీక్షించి దిశా, నిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ జిల్లాలోని రెవిన్యూ అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో వెరిఫికేషన్, రిజిస్ట్రేషన్ పై పూర్తిస్ధాయిలో విచారణ చేపట్టి పెండింగ్ అంశాలపై దృష్టిసారించాలని తెలిపారు. ప్రతి అంశాన్ని పూర్తి అవగాహనతోచేపట్టి అర్హులైన వారందరికి న్యాయం చేకూర్చాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భూసమస్యలపై వచ్చే ప్రతి అర్జీని పూర్తిగా అవగాహన చేసుకొని పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈకార్యక్రంలో జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, డిఆర్ఓ డి. పుష్పమణి, జిల్లా రిజిష్ట్రారు అధికారులు, ఆర్డిఓలు, కలెక్టరేట్ లోని పరిపాలనా విభాగం సూపరింటెండెంట్లు, తదితరులు పాల్గొన్నారు.
