BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

పెట్టుబడుదారి విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలి

తెలంగాణ
01 May, 2025 - 09:18 AM
127 వీక్షణలు
పెట్టుబడుదారి విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలి--ర్యాకల శ్రీశైలం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి NTODAY NEWS: బొమ్మలరామారం మండలం కార్పొరేటు పెట్టుబడుదారి విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు కార్మికులు పోరాటాలు చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం అన్నారు గురువారం రోజున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బొమ్మలరామారం మండలంలో139 వ మే డే ప్రపంచకార్మిక దినోత్సవ సందర్భంగా మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం ఆధ్వర్యంలో పది గ్రామ శాఖలలో జెండాలు ఎగరవేయడం జరిగింది ఈ సందర్భంగా ర్యాకల శ్రీశైలం మాట్లాడుతూ 1886 సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో పెట్టుబడిదారు విధానానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా పోరాటాలు చేసి ఎనిమిది గంటల పని దినం కార్మిక చట్టాలను సాధించడం జరిగిందని కానీ కేంద్ర ప్రభుత్వం బ్రిటిష్ వారి కాలంలో కార్మికులు సాధించుకున్న సాధించుకున్న చట్టాలను నిర్వీర్యం చేస్తూ కార్మిక వర్గాన్ని ప్రజలను పెట్టుబడుదారిదారులకు కంపెనీ యజమానులకు శ్రమను దోచుకోవడానికి అవకాశం కల్పిస్తుందని అన్నారు ఎలాంటి చట్టాలు సౌకర్యాలు కనీస వేతనాలు కల్పించకుండా యాజమాన్యాలు తన ఇష్టానుసారంగా పనిచేయించుకుంటున్నాయని అని అన్నారు కేంద్ర ప్రభుత్వం యాజమాన్యాలకు పెట్టుబడుదారులకు కొమ్ముకాస్తున్నాయని, రైతు నల్ల చట్టాలను తీసుకొస్తూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరకల్పించకుండా మార్కెట్ యార్డులు రైతుల రైతులు ప్రజల చేతులో భూమి లేకుండా కార్పొరేటు శక్తులకు పెట్టుబడిదారులకు అప్పజెప్పడానికి చూస్తున్నదని అని అన్నారు దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను సంపదను అంబానీ, ఆదానీలకు కట్టబెడుతూ దేశంలోని ప్రజల ఆస్తులను లూటీ చేస్తున్నదని అని అన్నారు మేడే అమరవీరులు అనేక పోరాటాలు చేసిన హక్కులు సాధించిన వాటిని అమలు చేయకుండా వారి త్యాగాలకు విలువ లేకుండా చేస్తున్నాయని 44 కార్మిక చట్టాలను నాలు గు కోడ్ గా చేస్తూ కార్మిక వర్గానికి ఉద్యోగ భద్రత కనీస సౌకర్యాలు లేకుండా చేస్తున్నాయని ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా మేడే అమరవీరుల త్యాగాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల పైన పోరాటాలు చేయాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు వెంకటేశం, సత్యనారాయణ, బ్రహ్మచారి, సత్తయ్య, బాలరాజు, సత్తయ్య, కొండమడుగు మనమ్మ, సంగీ కమలమ్మ, కిష్టమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube