కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి

Spread the love

కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి: దావ వసంత సురేష్

NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ 

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల పట్టణంలోని 38వ వార్డులో బీఆర్‌ఎస్ పార్టీ ప్రచారం ఉత్సాహంగా సాగింది. సోమవారం బీఆర్‌ఎస్ అభ్యర్థి తాడెపు మానస మహేశ్‌కు మద్దతుగా జిల్లా తొలి జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కారు గుర్తుపై ఓటు వేసి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు.


పేదలపై భారంగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రచార సమావేశంలో దావ వసంత సురేష్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో కేసీఆర్ పాలనలో పేదల సంక్షేమానికి అనేక పథకాలు అమలయ్యాయని, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ పథకాలకు కోతలు విధిస్తూ పేదలపై భారంగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలంటే ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు.
అభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యం
జగిత్యాల పట్టణ అభివృద్ధి బీఆర్‌ఎస్ పాలనలోనే సాధ్యమైందని, అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ కారు గుర్తుకే ఓటు వేయాలని దావ వసంత సురేష్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్ రావు, సారంగాపూర్ మండల అధ్యక్షుడు తేలు రాజు, వెల్దుర్తి మాజీ సర్పంచ్ బుర్ర ప్రవీణ్ గౌడ్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

#JagtialMunicipalElections
#BRSParty
#CarSymbol
#DavaVasanthaSuresh
#TelanganaPolitics
#LocalBodyElections

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »