అంబర్పేట్ అక్టోబర్ 2:: Ntodaynews.ప్రతినిధి
అంబర్పేట జోన్ కాచిగూడ కృష్ణానగర్, గోల్నాక మూసి పరివాహక ప్రాంతంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి పర్యటన చేసి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫోర్త్ సిటీ మూసి సుందరీకరణ, ఈ సుందరీ కరణ పేరుతో పేద ప్రజలను సిటీ బయటకి పంపి బడాబడా కార్పొరేట్ సంస్థలకు ఈ భూమిని అంత అప్పజెప్పి షాపింగ్ మాల్స్, గార్డెన్లు, స్కై వేలు, షిప్పులు, ఓడలు, స్టార్ హోటల్స్ కట్టి అభివృద్ధి చేయాలని చూస్తా ఉన్నారు. మూసి సుందరీకరణ స్వాగతిస్తా ఉన్నాము. కానీ అదే సందర్భంలో మూసి మురికి ప్రాంతంలో నివాసముంటున్న పేద ప్రజలను ఇల్లు తొలగించి వారిని ఉపాధి లేకుండా చేసి వారి బతుకులను రోడ్డుపాలు చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదు అని వారు హెచ్చరించారు. వారికి ఇప్పుడున్న జీవితాన్ని కంటే మెరుగైన జీవితాన్ని అందించి వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించి వారిని ఇక్కడి నుంచి తరలించి అభివృద్ధి చేయాలని, లేదంటే వారి ఇళ్ళను తొలగించకుండా మూసి లోపల అభివృద్ధి చేసుకోవాలని, వారు సూచించారు. లేని పక్షంలో సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతుందని జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు హెచ్చరించారు. మూసి సుందరీ కర్ణ పేరుతో పేద ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆ భయభ్రాంతులకు గురైన వారిలో ఇప్పటికే కూకట్పల్లి సుబ్బలక్ష్మి , ఆత్మహత్య చేసుకోగా, ఇప్పుడు గోల్నాక లంక ప్రాంతంలో కుమారు అనే వ్యక్తి భవన నిర్మాణ కార్మికుడు సెంట్రింగ్ మేస్త్రి ఆందోళన చెంది చనిపోవడం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే ఇది ప్రభుత్వ హత్యగా భావిస్తున్నాము, అని వారు హెచ్చరించారు. వారికి నష్టపరిహారంగా 20 లక్షలు ఇవ్వాలని వారి కుటుంబాన్ని ఆదుకోనీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజలతో మాట్లాడి బస్తీ మీటింగ్ ఏర్పాటు చేసి వారి న్యాయమైన కోరికలను అమలు చేయాలని వారందరూ ఒప్పుకుంటేనే ఇక్కడి నుంచి తరలించాలని వారు ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డిజి. నరసింహారావు ,నగర కార్యదర్శి ఎం. శ్రీనివాస్, నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. మహేందర్, అంబర్పేట జోన్ కమిటీ సభ్యులు జి. రాములు, బి.సుబ్బారావు, ఎల్.సోమయ్య, షబానా, y.వరలక్ష్మి, అఖిల్, లలిత, రైస్,k. ఏసు, రమేష్, బస్తివాసులు మల్లేష్ గౌడ్, ఉమాదేవి, ప్రసాద్, రవి తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply