మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలు 200 కోట్ల ప్రయాణాలు పూర్తి
NTODAY NEWS: హైదరాబాద్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయిన రెండో రోజే సోనియా గాంధీ పుట్టిన రోజున ప్రారంభించిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా ఇప్పటివరకు 200 కోట్ల ప్రయాణాలు పూర్తయ్యాయి. దీని ద్వారా రాష్ట్ర మహిళలు మొత్తం 6,680 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ మహిళలు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఉచితంగా ప్రయాణించగలుగుతున్నారని అన్నారు ఓకప్పుడు నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చాం. బస్సులను అద్దెకు ఇవ్వడం, పెట్రోల్ బంకులు మంజూరు చేయడం ద్వారా మహిళలకు ఆర్థికంగా నిలదొక్కుకునే మార్గం కల్పిస్తున్నాం అని అన్నారు ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేసి మహిళలను యజమానులుగా చేసిన ఘనత కూడా మా ప్రభుత్వానికి చెందుతుంది. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న ఆర్టీసీ కార్మికులు, అధికారులు, యాజమాన్యానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్న ప్రతి మహిళకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యంమన్నారు.

