ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మ శ్రీ ప్రసాద్ స్వయంగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ — “పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. భవిష్యత్ తరాల కోసం పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి. ఒక్కో మొక్క నాటడం వలన పర్యావరణానికి ఉపయోగం కలుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలి” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధికారులతో పాటు ఉద్యోగులు, పాల్గొన్నారు.