సంతకవిటి మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు 112 మంది అభ్యర్థులు
ఆంధ్రప్రదేశ్
ఫారం-6 పరిశీలన అనంతరం అభ్యర్థుల జాబితా ప్రచురణ
సంతకవిటి | ఎన్ టుడే న్యూస్: విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. మండల పరిధిలోని 19 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల ఫారం-6ను పరిశీలించిన అనంతరం మొత్తం 112 మంది అభ్యర్థుల జాబితాను ప్రచురించినట్లు ఎన్నికల అధికారి వెంకట అప్పలనాయుడు తెలిపారు.
ఎన్నికల ప్రక్రియలో కీలక దశ
నామినేషన్ల పరిశీలన అనంతరం అభ్యర్థుల జాబితాను ప్రకటించినట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు. మండలంలోని 19 ఎంపీటీసీ స్థానాలకు 112 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో ఎన్నికల ప్రక్రియపై ఆసక్తి నెలకొంది.