BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 03 April 2026, 11:43 am
Posted by : కూనురు మధు

చిట్యాలలో మొబైల్ దొంగలను పట్టుకున్న స్థానికులు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
03 Apr, 2026 - 11:43 AM
1,818 వీక్షణలు

చిట్యాలలో  మొబైల్ దొంగలను పట్టుకున్న స్థానికులు 

నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో గత వారం రోజులుగా వరుస మొబైల్ దొంగతనాలతో హడలెత్తిస్తున్న ముఠా ఎట్టకేలకు చిక్కింది. స్థానికుల అప్రమత్తతతో ఇద్దరు దొంగలు స్థానికులకు పట్టుబడగా, మరొకరు పరారైనట్లు సమాచారం. ​గత కొన్ని రోజులుగా చిట్యాల మండలంలో గుర్తుతెలియని వ్యక్తులు మొబైల్ ఫోన్లను యధేచ్ఛగా దొంగిలిస్తున్నారు. ఈ క్రమంలోనే గత నెల మార్చి 30వ తేదీన బాధితులు చిట్యాల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగానే, సదరు ముఠా మరోమారు చోరీలకు తెగబడింది. ​మరోసారి చిట్యాలలో ఓ ప్రయాణికుడు బస్సు ఎక్కుతున్న క్రమంలో  దొంగతనానికి పాల్పడుతుండగా అనుమానం వచ్చిన స్థానికులు చాకచక్యంగా వ్యవహరించి ముఠా సభ్యులను పట్టుకున్నారు. వెంటనే చిట్యాల పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు నిందితులను అప్పగించారు. ​ప్రస్తుతం అదుపులో ఉన్న నిందితులను పోలీసులు  విచారిస్తున్నారు. వీరు కేవలం చిట్యాల మండలంలోనే కాకుండా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా దొంగతనాలకు పాల్పడ్డారా? ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు జరుపుతున్నట్టు ప్రాథమిక సమాచారం..