BREAKING
ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ
Date of Publish : 17 August 2026, 05:31 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జర్నలిస్టుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళతా

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Aug, 2026 - 05:31 PM
50 వీక్షణలు

జర్నలిస్టుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళతా: ఎంపీ కేశినేని చిన్ని

తెలుగు జర్నలిజానికి పుట్టినిల్లు విజయవాడ

విజయవాడ సెంట్రల్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి సెమినార్ కార్యక్రమానికి హాజరైన ఆయన జర్నలిస్టుల సమస్యలపై మాట్లాడారు.

తెలుగు జర్నలిజానికి విజయవాడ పుట్టినిల్లు అని పేర్కొన్న ఎంపీ చిన్ని, ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

కార్యక్రమం ప్రారంభంలో ఏపీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ వద్ద సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే పుస్తకం, సావనీర్‌ను ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఇండియన్ యూనియన్ జర్నలిస్ట్స్ నాయకులు సింహ సుబ్బారావు, ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. అనంతరం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఆరోగ్య బీమా, సంక్షేమ పథకాలు, వృత్తిపరమైన భద్రత వంటి పలు సమస్యలపై ఎంపీ చిన్నికి వినతిపత్రం అందించారు.