రొంపిచర్ల పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ
పల్నాడు జిల్లా: రొంపిచర్ల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ పరిశీలించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించిన అనంతరం రికార్డులను తనిఖీ చేసి నమోదైన కేసుల వివరాలు, వాటి ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.
స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని, నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీస్ శాఖపై నమ్మకం పెరిగేలా సేవలు అందించాలని పేర్కొన్నారు.
చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాటిని అరికట్టాలని ఆదేశించారు. రానున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో సిబ్బందికి కేటాయించిన గ్రామాల్లో క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించి, పరిస్థితులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
కార్యక్రమంలో నరసరావుపేట రూరల్ సర్కిల్ సీఐ ఎం.వి. సుబ్బారావు, రొంపిచర్ల ఎస్‌ఐ లోకేశ్వరరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.