BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 15 November 2026, 08:58 pm
Posted by : K MAHESH

కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
K Mahesh Munugodu Constituency
15 Nov, 2026 - 08:58 PM
29 వీక్షణలు

ఈ నెల 22న హనుమకొండలో నిర్వహించనున్న సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి: స్వేరో మండల అధ్యక్షుడు మంద ప్రవీణ్

కేసముద్రం, నవంబర్ 15 (ఎన్ టుడే న్యూస్):

హనుమకొండలోని కాళోజి కళాక్షేత్రంలో ఈ నెల 22న నిర్వహించనున్న స్వేరో ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని స్వేరో మండల అధ్యక్షుడు మంద ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి పోలేపాక రాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం కేసముద్రం మున్సిపాలిటీ, మండల కేంద్రంలో సమ్మేళనానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు.

మాజీ జడ్పీటీసీ రావుల శ్రీనాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కమటం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు గుగులోత్ వీరు నాయక్, కౌన్సిలర్లు రావుల వినయ్ రెడ్డి, పాయిరాల శరత్, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కొండ్రెడ్డి రవీందర్ రెడ్డి, బిర్రు వెంకన్న, పందుల సంజీవ, మోడం రవీందర్ గౌడ్, ఉప్పరపల్లి సర్పంచ్ సునీత కుమారస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం స్వేరో మండల కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు మంద ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి పోలేపాక రాజు, ఉపాధ్యక్షుడు మిట్టగడుపుల జీవన్ కుమార్, అధికార ప్రతినిధి గుజ్జునూరు అఖిల్ తదితరులు పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విద్య, ఆత్మగౌరవం, సమానత్వం, సామాజిక న్యాయం, ఐక్యత వంటి ఆశయాలతో స్వేరో ఉద్యమం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ విద్యావంతులై, సంఘటితంగా సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

స్వేరో మండల అధ్యక్షుడు మంద ప్రవీణ్ మాట్లాడుతూ.. 'జై భీమ్.. జై స్వేరో' నినాదంతో యువతను ఉన్నత విద్య వైపు నడిపించడంతో పాటు జ్ఞాన సమాజ నిర్మాణమే స్వేరో ఉద్యమ లక్ష్యమని తెలిపారు. డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్ఫూర్తితో వేలాది మంది విద్యార్థులు, యువకులు విద్య, ఉద్యోగ, సామాజిక రంగాల్లో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.

ఈ నెల 22న హనుమకొండలో జరిగే స్వేరో ఆత్మీయ సమ్మేళనానికి స్వేరో అభిమానులు, విద్యార్థులు, యువకులు, మేధావులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంద ప్రవీణ్, పోలేపాక రాజు కోరారు.