BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 16 November 2026, 11:57 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆత్కూరులో టీడీపీ రెబల్ అభ్యర్థిగా మెండెం చిన్నబాబు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Nov, 2026 - 11:57 AM
8 వీక్షణలు

నామినేషన్ సర్పంచ్ అభ్యర్థిత్వంపై గ్రామంలో చర్చ.. స్వతంత్రంగా బరిలోకి దిగేందుకు సిద్ధం ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం: జి.కొండూరు మండలం ఆత్కూరు గ్రామంలో సర్పంచ్ ఎన్నిక రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తున్న మెండెం చిన్నబాబు (బీఎస్సీ) సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. పార్టీ రెబల్ అభ్యర్థిగా స్వతంత్రంగా నామినేషన్ దాఖలు చేసినట్లు సమాచారం. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తూ తన ఉద్యోగాన్ని కోల్పోయినప్పటికీ, తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేశారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. గ్రామంలోని వివిధ వర్గాల ప్రజలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ, వ్యవసాయ కూలీలు, కార్మికులతో కలిసి పనిచేస్తూ గ్రామస్థాయిలో గుర్తింపు పొందారని చెబుతున్నారు. గత ఆరు సంవత్సరాలుగా సుమారు 300 కుటుంబాలకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించడంలో కీలక పాత్ర పోషించారని, నీతి నిజాయితీలతో వ్యవహరిస్తూ గ్రామ ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నారని ఆయనకు మద్దతు తెలుపుతున్నవారు వెల్లడిస్తున్నారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామంలోని మెజార్టీ ప్రజలు చిన్నబాబును సర్పంచ్‌గా పోటీ చేయాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో గ్రామ కమిటీలో మెజార్టీ అభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వకుండా మెండెం లూర్దమ్మ పేరును ప్రతిపాదించి ఆమెను అభ్యర్థిగా నిర్ణయించారని కొందరు గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం వెనుక కొందరు గ్రామ పెద్దల వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. చిన్నబాబుకు అవకాశం కల్పించాలని గ్రామంలోని యువకులు, మహిళలు, పలువురు పెద్దలు కోరుతున్నట్లు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. పార్టీ తరఫున అభ్యర్థిత్వం ప్రకటించకపోయినా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే మద్దతు తెలిపి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నామని గ్రామంలోని పలువురు వెల్లడిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆత్కూరు గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య పోటీపై ఆసక్తి నెలకొంది.