BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 15 November 2026, 08:35 pm
Posted by : K MAHESH

మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
K Mahesh Munugodu Constituency
15 Nov, 2026 - 08:35 PM
15 వీక్షణలు

ఉద్యోగ అవకాశాల కోసం యువత నుంచి దరఖాస్తులు స్వీకరణ

ఇబ్రహీంపట్నం, నవంబర్ 15 (ఎన్ టుడే న్యూస్):

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో ఆదివారం ప్రజాభవన్‌లో జాబ్ మేళా నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహకారంతో, ఆయన తనయుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మల్‌రెడ్డి అభిషేక్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జాబ్ మేళాకు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఉద్యోగాల కోసం వచ్చిన యువతీ యువకులు తమ విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లతో జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగాల కోసం దరఖాస్తులు సమర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన అభిషేక్ రెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గుండెమోని జయమ్మ, మల్లేష్ ముదిరాజ్ తదితరులు యువతను వ్యక్తిగతంగా పలకరిస్తూ వారి విద్యార్హతలు, ఉద్యోగ సంబంధిత సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు.

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశాలు లభించేలా కృషి చేస్తామని అభిషేక్ రెడ్డి యువతకు భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పాలకుర్ల శేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే దృఢ సంకల్పంతో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలోని వివిధ కంపెనీల యజమానులతో సంప్రదింపులు జరిపి జాబ్ మేళా నిర్వహించడం ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నించడం అభినందనీయమన్నారు.

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో జాబ్ మేళా నిర్వహించేందుకు సహకరించిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మల్‌రెడ్డి అభిషేక్ రెడ్డికి పాలకుర్ల శేఖర్ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలు, మున్సిపాలిటీల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, నిరుద్యోగ యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.