BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 16 November 2026, 09:53 am
Posted by : BOYA SWAMY

శ్రీశైలం ప్రాజెక్టులో తగ్గుతున్న నీటి నిల్వలు.. 48.57 టీఎంసీలకు చేరిన నీటిమట్టం

తెలంగాణ
/ నల్గొండ / కొండమల్లేపల్లి
Reporter
Boya Swamy Chityala Mandal
16 Nov, 2026 - 09:53 AM
12 వీక్షణలు

కేవలం 9 రోజుల్లో 3.03 టీఎంసీల నీరు తగ్గుదల.. వేసవిలో తాగునీటి అవసరాలపై ఆందోళన

ఎన్ టుడే న్యూస్: శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రాజెక్టుకు వరద ప్రవాహాలు నిలిచిపోవడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి, నీటి వినియోగం నేపథ్యంలో జలాశయంలో నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 215.80 టీఎంసీల పూర్తి నిల్వ సామర్థ్యానికి గానూ 48.57 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం.

శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 829.10 అడుగులకు చేరింది. గత తొమ్మిది రోజుల్లోనే జలాశయంలో 3.03 టీఎంసీల నీటి నిల్వ తగ్గినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. రోజుకు సగటున 0.33 టీఎంసీల మేర నీరు తగ్గుతున్నట్లు తెలుస్తోంది.

నిలిచిన వరద ప్రవాహాలు.. విద్యుత్ ఉత్పత్తి

జూరాల, సుంకేసుల, హంద్రీ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం నిలిచిపోయింది. మరోవైపు కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కూడా నిలిచిపోయినట్లు సమాచారం.

తాగునీటి అవసరాలపై అధికారుల ప్రణాళిక

హైదరాబాద్‌తో పాటు నల్లగొండ, ఖమ్మం ప్రాంతాల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని జూలై వరకు నీటిని అందుబాటులో ఉంచేలా అధికారులు ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలను జాగ్రత్తగా వినియోగించాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇదే విధంగా నీటి నిల్వలు తగ్గుతూ పోతే రానున్న వేసవిలో తాగునీటి సరఫరాపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జలాశయంలో అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించడం, తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం కీలకంగా మారనుంది.