BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 08:36 pm
Posted by : K MAHESH

చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
K Mahesh Munugodu Constituency
15 Nov, 2026 - 08:36 PM
20 వీక్షణలు

ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ బానోతు సునీత

కేసముద్రం, నవంబర్ 15 (ఎన్ టుడే న్యూస్):

కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో భారీ వృక్షాల తొలగింపుపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని మున్సిపల్ చైర్‌పర్సన్ బానోతు సునీత స్పష్టం చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న చెట్లను తొలగించినట్లు ఆమె వెల్లడించారు.

ఈ సందర్భంగా బానోతు సునీత మాట్లాడుతూ.. 6వ వార్డులోని కొన్ని భారీ వృక్షాల కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చెట్ల కొమ్మలు విద్యుత్ వైర్లకు తగులుతుండటంతో పాటు, వాటిపై గబ్బిలాలు, కోతుల సంచారం వల్ల పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. అంతేకాకుండా చెట్ల వేర్లు సమీపంలోని నివాస గృహాల పునాదుల్లోకి చొచ్చుకెళ్లి గోడలకు పగుళ్లు ఏర్పడుతున్నాయని స్థానికులు తమ సమస్యలను తెలియజేశారని వివరించారు.

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత ప్రభుత్వ అనుమతులు పొందిన అనంతరమే చెట్ల తొలగింపు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియకు అయిన ఖర్చులను మినహాయించి మిగిలిన మొత్తాన్ని మున్సిపల్ ఖజానాకు జమ చేస్తామని తెలిపారు.

ప్రజలకు ఉపయోగపడే పనులు చేపడుతున్నప్పటికీ పూర్తి వివరాలు తెలుసుకోకుండా తనపై వ్యక్తిగత అక్కసుతో ఆరోపణలు చేస్తున్నారని సునీత విమర్శించారు. తాను గిరిజన మహిళా ప్రజాప్రతినిధిని అన్న కారణంతోనే కొందరు చౌకబారు ఆరోపణలకు దిగుతున్నారని మండిపడ్డారు.

బాధ్యతాయుతమైన 6వ వార్డు కౌన్సిలర్ పదవిలో ఉన్న వ్యక్తి వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. నిరాధార ఆరోపణలను ఉపేక్షించబోమని, తనపై అసత్య ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్‌పర్సన్ బానోతు సునీత హెచ్చరించారు.