BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 07:02 pm
Posted by : K MAHESH

సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
15 Nov, 2026 - 07:02 PM
24 వీక్షణలు

8వ సామాజిక సేవకుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రత్యేక పురస్కారం ప్రదానం

బయ్యారం, నవంబర్ 15 / ఎన్ టుడే న్యూస్:

సమాజంలోని నిరుపేదలు, విద్యార్థులు, మహిళలు, దివ్యాంగుల అభ్యున్నతే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బయ్యారం మండలం గంధంపల్లికి చెందిన చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయిలో విశిష్ట గుర్తింపు లభించింది. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఫౌండేషన్ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తిస్తూ ప్రత్యేక పురస్కారాన్ని అందజేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపంలో అఖిల భారత ఎన్జీవోల సంక్షేమ సంఘం, కేబీఆర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 8వ సామాజిక సేవకుల ఆత్మీయ సమ్మేళనంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో చేతన ఫౌండేషన్ ప్రతినిధి చంద్రకాని నవీన్‌కు గౌరవ అతిథిగా గుర్తింపు కల్పించడంతో పాటు ప్రశంసా పురస్కారాన్ని అందజేశారు.

గత కొన్నేళ్లుగా చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకు అండగా నిలిచేలా పలు సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నిరుపేద విద్యార్థులకు విద్యా సహాయం అందించడం, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఆహార పంపిణీ చేయడం, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలపై ప్రోత్సాహం కల్పించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

అదేవిధంగా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు దివ్యాంగులకు అవసరమైన సహాయ పరికరాలను పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ అవసరమైన వారికి సహాయం అందించేందుకు ఫౌండేషన్ కృషి చేస్తోంది.

ఈ సేవలను గుర్తించి రాష్ట్రస్థాయి సమ్మేళనంలో పురస్కారం అందించడం ఫౌండేషన్ సభ్యుల్లో ఆనందాన్ని నింపింది. ఈ సందర్భంగా చేతన ఫౌండేషన్ అధ్యక్షుడు వేణిగళ్ల రవికుమార్ మాట్లాడుతూ తమ సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలను గుర్తించి ప్రత్యేక పురస్కారం అందించిన కేబీఆర్ ఫౌండేషన్ నిర్వాహకులకు, కొడవటికంటి బాలరాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ అవార్డు తమ సంస్థపై మరింత బాధ్యతను పెంచిందని ఆయన పేర్కొన్నారు. పురస్కారం ద్వారా లభించిన ప్రోత్సాహంతో భవిష్యత్తులో మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. సమాజంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తూ పేదలు, విద్యార్థులు, మహిళలు, దివ్యాంగుల సంక్షేమం కోసం తమ వంతు కృషిని కొనసాగిస్తామని వేణిగళ్ల రవికుమార్ స్పష్టం చేశారు.