BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 06:57 pm
Posted by : K MAHESH

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
15 Nov, 2026 - 06:57 PM
19 వీక్షణలు

బయ్యారంలో రెండు బజార్లకు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన

బయ్యారం, నవంబర్ 15 / ఎన్ టుడే న్యూస్:

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నామని బయ్యారం గ్రామ సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి, వాటికి ప్రాధాన్యతనిస్తూ అవసరమైన అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు వెల్లడించారు.

ఈ క్రమంలో ఆదివారం బయ్యారం గ్రామపంచాయతీ పరిధిలోని తాటి జనార్దన్ బజారులో రెండు బజార్లకు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ శంకుస్థాపన చేశారు. ఎన్నో ఏళ్లుగా మట్టి రోడ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికుల సమస్యను పరిష్కరించేందుకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడంతో కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వర్షాలు కురిసిన సమయంలో మట్టి రోడ్లపై రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయితే స్థానికులకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని భావిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో భాగంగా ఈ పనులను ప్రారంభించినట్లు సర్పంచ్ పేర్కొన్నారు.

గ్రామంలోని అన్ని కాలనీల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను గుర్తించి, ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా అభివృద్ధి పనులు చేపడతామని ఆమె తెలిపారు. గ్రామ ప్రజల సహకారంతో బయ్యారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఏనుగుల ఉమా, వార్డు సభ్యులు వల్లాల కల్పన, కత్తి రమేష్, నాయకులు వల్లాల వెంకన్న, తాటి జనార్దన్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.