BREAKING
thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ
Date of Publish : 16 June 2026, 03:19 pm
Posted by : V శ్రీనివాస్

​సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక నిర్ణయం: సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు విశ్రాంత ఉద్యోగుల పాలాభిషేకం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
16 Jun, 2026 - 03:19 PM
1,867 వీక్షణలు

వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం

మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 130 సంవత్సరాల సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, అతి తక్కువ కోల్ మైన్స్ పెన్షన్ పొందుతున్న యావత్ సింగరేణిలోని 70 సంవత్సరాల లోపు విశ్రాంత ఉద్యోగులకు (కోల్ మైన్స్ పెన్షనర్లకు) రూ. 30 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యాన్ని, అలాగే సహజ మరణానికి కూడా రూ. 10 లక్షల వరకు బీమా సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. విశ్రాంత ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతగా.. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్, సింగరేణి డైరెక్టర్ (పా) పోట్రు గార్ల చిత్రపటాలకు విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు అత్యంత ఉత్సాహంగా పాలాభిషేకం చేసి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.

​ఈ సందర్భంగా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ.. తమ సంఘం చేసిన సుదీర్ఘ పోరాట ఫలితంగానే నేడు విశ్రాంత ఉద్యోగులకు ఇంత పెద్ద మొత్తంలో బీమా సౌకర్యం లభించిందని కొనియాడారు. ప్రమాదవశాత్తు ఏ విశ్రాంత ఉద్యోగి అయినా మరణిస్తే, వారి కుటుంబానికి ఈ బీమా ఎంతో ఆసరాను, భరోసాను కల్పిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ బీమా సౌకర్యం కల్పించడంలో సింగరేణి యాజమాన్యానికి పూర్తిస్థాయిలో సహకరిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), యూనియన్ బ్యాంకుతో పాటు ఇతర బ్యాంకు యాజమాన్యాలకు ఈ సందర్భంగా ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు రాళ్ళబండి రాజన్న, ప్రధాన కార్యదర్శి పుదారి నర్సయ్య, ఉపాధ్యక్షులు ఏ. గంగయ్య, పుప్పిరెడ్డి రాంరెడ్డి, మేడ రాజలింగు, బూర్ల జ్ఞాని, ఆర్గనైజింగ్ కార్యదర్శి కాటం లక్ష్మణ్, అవదూత శంకరయ్య, సలహాదారులు సత్యనారాయణ రావు, అంజన్న, దేవులపల్లి రామస్వామి, గజెల్లి సుదర్శన్, నాయకులు ఎండీ హుస్సేన్, ఎం.ఎస్. అలీ బేగ్, గురువయ్య, సంగెం రాంచందర్, కొత్తపల్లి రాంబ్రహ్మం, పి. రాజు, మామిడిపల్లి అంజయ్య తదితర ముఖ్య నాయకులు, విశ్రాంత ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు