BREAKING
ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 28 July 2026, 08:28 pm
Posted by : యామనూరి మల్లికార్జున

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
28 Jul, 2026 - 08:28 PM
53 వీక్షణలు

మంగళవారం నంద్యాల వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుండి శ్రీనివాస్ సెంటర్ వరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, డిఎస్‌సి (DSC) నిర్వహణలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది.*

ఈ ప్రజా క్షేత్ర పోరాటంలో వైఎస్‌ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటాసాని రాంభూపాల్ రెడ్డి గారు, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కాటాసాని రామిరెడ్డి గారు, ఎమ్మెల్సీ ఇసాక్ భాషా గారితో పాటు వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో నిరుద్యోగ అభ్యర్థులు, విద్యార్థులు పాల్గొని ప్రభుత్వంపై తమ నిరసనను తెలిపారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ భాషా గారు మాట్లాడుతూ..


 గైడ్‌లైన్స్ ఉల్లంఘన: ప్రభుత్వం గైడ్‌లైన్స్ ప్రకారమే నోటిఫికేషన్ ఇచ్చామని చెబుతున్నప్పటికీ, అందులో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపించారు.

 నవీన్ కేసు / స్టేట్ ఫస్ట్ వివాదం: NOC లేకుండా పరీక్ష రాసిన ఒక అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి (నవీన్) మొదట స్టేట్ ఫస్ట్ వచ్చినట్లు ప్రకటించి, ఆ తర్వాత రిజల్ట్ నుంచి పేరు తీసివేసి సెకండ్ లిస్ట్ ఇచ్చారని పేర్కొన్నారు.

 బాధితుడికి అన్యాయం: సదరు అభ్యర్థి కోర్టును ఆశ్రయించగా, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరుకాలేదనే వంకతో అనర్హుడిగా చూపించడాన్ని తప్పుబట్టారు.

 స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం: 409 పోస్టుల స్పోర్ట్స్ కోటా మరియు సంబంధిత GOలను మార్చేసి, అర్హత లేని తమ వర్గం వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని విమర్శించారు.

 1:1 రేషియో మోసం: సాధారణంగా 1:2 పిలవాల్సి ఉండగా, 1:1 పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేశాక కూడా చాలామందికి ఉద్యోగాలు రాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

  పారదర్శకత లోపం: ఏ పరీక్షకైనా మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ స్పష్టంగా ఇవ్వాలి, కానీ ఏ లిస్టూ లేకుండా నేరుగా ఇంటర్వ్యూలకు పిలవడం ఏంటని ప్రశ్నించారు.

 CBI విచారణ డిమాండ్: దాదాపు 3.5 నుంచి 4 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారని, ఈ అక్రమాలపై ప్రభుత్వం నిర్దోషి అయితే CBI విచారణకు ఎందుకు భయపడుతోందో చెప్పాలని, విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.