గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి....
గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.. ప్రజా సమస్యలపై ఆరా | గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం అవసరం: సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్
శాలిగౌరారం: నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం గురజాల గ్రామంలో గ్రామ సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలపై గ్రామ వార్డు సభ్యులు, ప్రజలకు వివరించారు. సర్పంచ్‌గా ఎన్నికైనప్పటి నుంచి గ్రామంలో జరిగిన ఆదాయ, వ్యయ వివరాలను గ్రామ సభలో ప్రజలకు వెల్లడించారు.
అలాగే గ్రామంలో ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిపై చర్చించారు. గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకన్న, ఉప సర్పంచ్ ముత్యాల ఉపేందర్, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి వివిధ హోదాల్లో ఉన్న ఉద్యోగులు, గ్రామ పెద్దలు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.