BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 19 March 2026, 10:56 pm
Posted by : కూనురు మధు

చిట్యాల సుజన థియేటర్‌లో ఉద్రిక్తత

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
19 Mar, 2026 - 10:56 PM
1,679 వీక్షణలు

 'ఉస్తాద్ భగత్ సింగ్' షో రద్దు
*టికెట్ ధరలు వాపస్
నల్గొండ జిల్లా ​చిట్యాల  పట్టణంలోని సుజన సినిమా థియేటర్ వద్ద గురువారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ షో ప్రదర్శన సందర్భంగా సాంకేతిక లోపాలు తలెత్తడంతో ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ​
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ షోను వీక్షించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్‌కు చేరుకున్నారు. అయితే, సినిమా ప్రారంభమైనప్పటి నుంచి సౌండ్ సిస్టంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది.
డైలాగులు వినిపించకపోవడం, సౌండ్ సరిగా లేకపోవడంతో విసుగు చెందిన ప్రేక్షకులు షో మధ్యలోనే బయటకు వచ్చి ఆందోళనకు దిగారు.
థియేటర్ లోపల సౌకర్యాలు లేవని, నాణ్యమైన సౌండ్ సిస్టం లేకుండా షో ఎలా వేస్తారని యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో యాజమాన్యానికి, ప్రేక్షకులకు మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.
పరిస్థితి అదుపు తప్పుతుండటంతో థియేటర్ యాజమాన్యం వెనక్కి తగ్గింది. ఫస్ట్ షో చూస్తున్న ప్రేక్షకులకు టికెట్ డబ్బులను వెనక్కి ఇచ్చేసి సర్దిచెప్పింది. నిరాశతో
వెనుదిరిగిన ఫ్యాన్స్
​ఫస్ట్ షో గందరగోళం కారణంగా సాంకేతిక సమస్య సద్దుమణగకపోవడంతో, యాజమాన్యం సెకండ్ షోను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటికే సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు పరిస్థితిని తెలుసుకుని తీవ్ర నిరాశతో వెనుతిరిగారు.