BREAKING
thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన..
Date of Publish : 13 August 2026, 08:50 am
Posted by : PEDDABOINA SRIKANTH

వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
13 Aug, 2026 - 08:50 AM
74 వీక్షణలు

ఎంజీఎం ఆస్పత్రిలో కుక్కల సంచారం

భయాందోళనలో రోగులు, బంధువులు.. చర్యలు తీసుకోవాలని డిమాండ్

వరంగల్ | Ntoday News

వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రి ప్రాంగణంలో వీధి కుక్కలు సంచరిస్తుండటంపై రోగులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి పరిసరాల్లో కుక్కలు స్వేచ్ఛగా తిరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చే రోగులు, వారితో ఉండే కుటుంబ సభ్యులు కుక్కల సంచారంతో భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, రోగులకు కుక్కల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆస్పత్రి ప్రాంగణంలో కుక్కల సంచారాన్ని నియంత్రించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని రోగుల బంధువులు కోరుతున్నారు. ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.