దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు
కదిరి: నంబులపూలకుంట మండలం దిగువ గూటిబైలు గ్రామంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్ జన్మదిన వేడుకలను ఆదివారం నిర్వహించారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్ జయరామ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
జన్మదిన వేడుకల్లో భాగంగా గ్రామంలోని వృద్ధులు, గర్భిణులు, చిన్నారులకు పాలు, పండ్లు, కాయలు, బెడ్లు తదితరాలను పంపిణీ చేశారు. గ్రామ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జయరామ్ మాట్లాడుతూ.. పనతల సురేష్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ద్వారా సుమారు 15 సంవత్సరాల పాటు విద్యార్థుల సమస్యలపై పనిచేశారని తెలిపారు. అనంతరం బీజేపీలో కార్యకర్తగా, నాయకుడిగా వివిధ కార్యక్రమాల్లో భాగస్వామ్యమయ్యారని పేర్కొన్నారు.
పనతల సురేష్ జన్మదినాన్ని గ్రామస్తులతో కలిసి నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని జయరామ్ అన్నారు. ఆయనకు మరిన్ని జన్మదినాలు జరగాలని, భవిష్యత్తులో మరిన్ని బాధ్యతలు చేపట్టి పేదలు, దళితుల కోసం సేవ చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు రెడ్డప్ప, కూటమి నాయకులు రామాంజులు, అదెప్ప, దేవేంద్ర, గంగాద్రి, కృష్ణమూర్తి, నరసింహులు, ఆంజనేయులు, శ్రీరాములు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.