BREAKING
thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక
Test 4
Date of Publish : 11 November 2026, 08:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడిలో ఘనంగా అసిస్టెంట్ ఇంజనీర్ జగన్నాధ రావు పదవీ విరమణ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Nov, 2026 - 08:45 PM
28 వీక్షణలు

42 ఏళ్ల పాటు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో విశిష్ట సేవలు చింతలపూడి: పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో 42 సంవత్సరాల పాటు అంకితభావంతో సేవలందించి పదవీ విరమణ పొందిన అసిస్టెంట్ ఇంజనీర్ K.T.V.N.N. జగన్నాధ రావుకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా చింతలపూడి నగర పంచాయతీ పరిధిలోని స్థానిక ఎం హోటల్‌లో నిర్వహించిన ఆత్మీయ అభినందన సభకు చింతలపూడి శాసనసభ్యుడు సొంగా రోషన్ కుమార్ హాజరయ్యారు. జగన్నాధ రావు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో వివిధ హోదాల్లో 42 ఏళ్ల పాటు సేవలందించారని, ముఖ్యంగా చింతలపూడి, లింగపాలెం మండలాల్లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ తన విధి నిర్వహణతో ప్రత్యేక గుర్తింపు పొందారని పలువురు కొనియాడారు. తన సుదీర్ఘ అనుభవంతో ఎందరో ఉద్యోగులకు మార్గదర్శకులుగా నిలిచారని ప్రశంసించారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాలకు పైగా ప్రభుత్వ సేవలందించడం అభినందనీయమని పేర్కొన్నారు. జగన్నాధ రావు అందించిన సేవలు చిరస్మరణీయమని, పదవీ విరమణ అనంతరం ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ చింతలపూడి శాసనసభ్యుడు ఉన్నమట్ల ఎలిజా, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సహోద్యోగులు, అభిమానులు పాల్గొని జగన్నాధ రావుకు శుభాకాంక్షలు తెలియజేశారు.