BREAKING
thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక
Test 4
Date of Publish : 11 November 2026, 08:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కాకర్లలో పోలీసుల కవాతు.. ప్రశాంత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చర్యలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Nov, 2026 - 08:53 PM
21 వీక్షణలు

తిరువూరు, నవంబర్ 11: రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంతో పాటు ప్రజల్లో భద్రతా భావాన్ని కల్పించే లక్ష్యంతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం కాకర్ల గ్రామంలో బుధవారం సాయంత్రం పోలీసులు కవాతు నిర్వహించారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు, రూరల్ డీసీపీ బి. లక్ష్మీనారాయణ ఐపీఎస్, మైలవరం ఏసీపీ పి. రామచంద్రరావు సూచనలతో ఈ కార్యక్రమం చేపట్టారు. తిరువూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. గురు ప్రకాష్ నేతృత్వంలో పోలీసు సిబ్బంది గ్రామంలోని ప్రధాన వీధుల గుండా కవాతు నిర్వహించారు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కవాతు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గురు ప్రకాష్ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసు శాఖ తరఫున అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజలు ఎన్నికల సమయంలో సంయమనం పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.