BREAKING
thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక
Test 4
Date of Publish : 11 November 2026, 07:54 pm
Posted by : K MAHESH

ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
11 Nov, 2026 - 07:54 PM
18 వీక్షణలు

నియామక పత్రం అందజేసిన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్.. సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన రాములు

యాదాద్రి జిల్లా, రామన్నపేట, నవంబర్ 11: ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా కామ్రేడ్ రెబ్బాస్ రాములు నియమితులయ్యారు. ఈ మేరకు ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. జిల్లా స్థాయిలో ఫోరం బలోపేతానికి, ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేయాలనే బాధ్యతతో ఈ నియామకం చేపట్టినట్లు కార్యక్రమంలో పేర్కొన్నారు.

నియామక పత్రం అందుకున్న అనంతరం రెబ్బాస్ రాములు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి జిల్లా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ ఎస్.కె. చాంద్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్నలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉద్యమకారుల ఫోరం అభివృద్ధికి కృషి చేస్తానని రాములు తెలిపారు. ఉద్యమకారుల సమస్యలను గుర్తించి, వారి హక్కులు, సంక్షేమం కోసం ఫోరం తరఫున పనిచేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రామన్నపేట మండల అధ్యక్షుడు నోముల శంకర్, ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎం.డి. ఇమామ్ సాబ్‌తో పాటు ఉద్యమ నాయకులు గొలుసుల ప్రసాద్, ఆవుల నరేందర్, మధ్య గల నరసింహ, కైరం కొండ సంతోష్, వంగాల యాదయ్య, గడ్డం యాదగిరి, ఏలూరు రవి, డాక్టర్ కొండా మల్లేష్, డాక్టర్ నకిరేకంటి అశోక్, స్కైలాబ్ తదితరులు పాల్గొన్నారు.