BREAKING
thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక
Test 4
Date of Publish : 11 November 2026, 08:08 pm
Posted by : K MAHESH

14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
11 Nov, 2026 - 08:08 PM
18 వీక్షణలు

యూఏఈ అండర్‌-15 అకాడమీ లీగ్‌లో లోకేష్ రెడ్డి అసాధారణ ప్రదర్శన.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు

బయ్యారం, నవంబర్ 11: చిన్న వయసులోనే క్రికెట్‌లో అసాధారణ ప్రతిభను చాటుకుంటూ బయ్యారం మండలానికి చెందిన 14 ఏళ్ల లోకేష్ రెడ్డి అరుదైన ఘనత సాధించారు. యూఏఈలో నిర్వహించిన అండర్‌-15 అకాడమీ లీగ్ 2026-27 (డివిజన్-3) టోర్నమెంట్‌లో అద్భుత బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి కేవలం 109 బంతుల్లోనే అజేయంగా 300 పరుగులు సాధించారు. ఈ ప్రదర్శనతో క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించారు.

కసిరెడ్డి సురేందర్ రెడ్డి చిన్న కుమారుడైన లోకేష్ రెడ్డి తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 28 ఫోర్లు, 23 సిక్సర్లు బాది మైదానంలో పరుగుల వరద పారించారు. ముఖ్యంగా ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని చాటుకున్నారు. కేవలం 109 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ మార్కును చేరుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.

లోకేష్ రెడ్డి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో డెజర్ట్ కబ్స్ లయన్స్ జట్టు నిర్ణీత 30 ఓవర్లలో 420 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం బౌలర్లు సమష్టిగా రాణించి ప్రత్యర్థి జట్టును కేవలం 67 పరుగులకే కట్టడి చేశారు. దీంతో డెజర్ట్ కబ్స్ లయన్స్ జట్టు 353 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. జట్టు విజయానికి లోకేష్ సాధించిన అజేయ ట్రిపుల్ సెంచరీ కీలకంగా నిలిచింది

లోకేష్ ఆటతీరును అకాడమీ ప్రధాన కోచ్ పాలొన్నవిటా, ఆస్ట్రేలియా మాజీ టెస్ట్ క్రికెటర్ జో బర్న్స్ ప్రత్యేకంగా అభినందించినట్లు సమాచారం. చిన్న వయసులోనే అంతర్జాతీయ వేదికపై ఇంతటి ప్రతిభ కనబరచడం పట్ల ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్ తన అభిమాన క్రికెటర్లని తెలిపారు. భవిష్యత్తులో భారత జాతీయ జట్టు తరఫున అంతర్జాతీయ స్థాయిలో టెస్ట్ క్రికెట్ ఆడటమే తన లక్ష్యమని వెల్లడించారు.

14 ఏళ్ల వయసులోనే ట్రిపుల్ సెంచరీ సాధించి, భారీ విజయానికి బాటలు వేసిన లోకేష్ రెడ్డి ప్రతిభపై బయ్యారం ప్రాంతంలో హర్షం వ్యక్తమవుతోంది. ఆయన తాత కసిరెడ్డి వెంకటరెడ్డి, కుటుంబ సభ్యులు, స్థానికులు లోకేష్‌ను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. చిన్న వయసులోనే క్రీడారంగంలో ప్రతిభను చాటుకుంటున్న లోకేష్ రెడ్డి బయ్యారం ప్రాంతానికి గుర్తింపు తీసుకొస్తున్నారు.