BREAKING
thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక
Test 4
Date of Publish : 11 November 2026, 08:12 pm
Posted by : K MAHESH

అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / వలిగొండ
Reporter
K Mahesh Munugodu Constituency
11 Nov, 2026 - 08:12 PM
19 వీక్షణలు

ఈ నెల 15న నల్గొండలో భారీ సభ.. రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు కోసం రామన్నపేటలో శిక్షణ

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట, నవంబర్ 11: అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభల సందర్భంగా ఈ నెల 15న నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. సభకు యువతీ యువకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

రామన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అనిల్ కుమార్ మాట్లాడుతూ.. అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభల సందర్భంగా నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు ముందు నిర్వహించే భారీ ప్రదర్శనలో భాగంగా సుమారు పది వేల మంది రెడ్ షర్ట్ వాలంటీర్లతో కవాతు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కవాతులో రామన్నపేట మండలం నుంచి యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. కవాతు విజయవంతంగా నిర్వహించేందుకు శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. యువత క్రమశిక్షణతో శిక్షణలో పాల్గొని, ఈ నెల 15న నల్గొండలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు మెట్టు శ్రావణ్, కార్యదర్శి శానగొండ రాము, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఈర్ల రాహుల్, ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్ కుమార్, నాయకులు మేడి ముకుంద, అప్పం సురేందర్, ఎర్ర బిక్షపతి, పిట్టల నవీన్, చింతల రాజు తదితరులు పాల్గొన్నారు.